బహుజన సంస్కృతికి మద్దతుగా డప్పుల పంపిణీ
విశ్వంభర, గుండాల: మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో గుండాల మండలంలోని అన్ని గ్రామాల్లో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్న మబ్బు అబ్బాస్ ఫౌండేషన్, బహుజన సంస్కృతి, సంప్రదాయ కళలను పరిరక్షించే దిశగా మరో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఫౌండేషన్ చైర్మన్ మబ్బు మహేష్ సహకారంతో గుండాల మండలంలోని పెద్దపడిశాల గ్రామంలో డప్పుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామీణ కళాకారులను ప్రోత్సహించడం, బహుజన సంస్కృతికి ప్రతీక అయిన డప్పు కళను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మబ్బు మహేష్ మాట్లాడుతూ, సేవా కార్యక్రమాలతో పాటు సామాజిక, సాంస్కృతిక విలువలను పరిరక్షించేందుకు మబ్బు అబ్బాస్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా మండలంలోని అన్ని గ్రామాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలను విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రణమల్ల అనితా శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచ్ మడే గజ్జ మహేష్, గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, మబ్బు అబ్బాస్ ఫౌండేషన్ సభ్యులు, బహుజన కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.