మేచరాజుపల్లిలో శ్రీరామ హృదయ కలశానికి ఘన స్వాగతం

విశ్వంభర, నెల్లికుదురు: లోక సుభిక్షం కోరుతూ వికాస తరంగిణి వారు శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి వద్ద నుంచి తీసుకువచ్చిన శ్రీరామ హృదయ కలశం మండలంలోని మేచరాజుపల్లికి ఆదివారం చేరుకుంది. మన ఊరు మన గుడి ట్రస్ట్ చైర్మన్ నాళ్ళ వేణుమాధవ్ ఆధ్వర్యంలో స్థానిక సర్పంచి తూర్పాటి శంకర్ తో సహా గ్రామస్తులు మంగళహారతులు భాజా భజంత్రీలతో ఘనస్వాగతం పలికారు. గ్రామం శ్రీరామ నామస్మరణతో మారు మ్రోగింది. రైస్ మిల్ సమీపం నుంచి గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్దకు తీసుకువచ్చి ఆలయంలో శ్రీరామ హృదయ కలశాన్ని ఆసీనపరిచారు. అనంతరం గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి భక్తులు 108 బియ్యపు గింజలను,మంగళహారతులు,పూజా ద్రవ్యాలతో సహా తీసుకువచ్చి శ్రీ రామ జయ రామ జయ జయ రామ అంటూ కలశంలో సమర్పించారు.భక్తులు తమ గ్రామం సమృద్ధిగా వర్షాలు కురిసి,పాడి పంటలతో, ప్రజారోగ్యంతో విలసిల్లాలని భగవంతునికి మొక్కుకున్నారు. ఈ సందర్భంగా మన ఊరు మన గుడి ట్రస్ట్ చైర్మన్ నాళ్ళ వేణు మాధవ్ మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం శ్రీరామ హృదయ కలశపూజ ఎంతగానో దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్లపల్లి వెంకన్న గౌడ్, డిఆర్డిఏ డి పి ఎం నాళ్ళ నలిని వేణుమాధవ్, మోహన్ రావు కూరపాటి వెంకటేశ్వర్లు, కారోబార్,దూబర్ల సాయిలు,వికాస తరంగిణి ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

🕒 10 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-warm-welcome-to-sri-rama-hrudaya-kalash-at-mecharajupalli/article-21557

Tags: