గడికోట లో అమ్మవారికి వైభవంగా బోనాలు
విశ్వంభర, పెద్ద శంకరంపేట: పెద్ద శంకరంపేటలోని గడికోట దుర్గామాత అమ్మవారికి ఆదివారం సాయంత్రం వైభవంగా బోనాలు నిర్వహించారు. శ్రీ సరస్వతి శిశు మందిర్ (దేవుడి ) నుండి భాజా భజంత్రీలతో మహిళలు బోనాల నేత్తిన పెట్టుకొని శివసత్తులు నృత్యాలతో పట్టణ పురవీధుల గుండా ఊరేగింపుగా వెళ్లి గడికోటలోని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఉదయం శ్రీ సరస్వతి శిశు మందిర్ నుండి అమ్మవారి చిత్రపటం. తొట్టెలను ఊరేగింపుగా గడికోట కు చేరుకొని అమ్మవారికి వేద బ్రాహ్మణ పండితుల మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు.