పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్ధిక చేయూత
- ఆర్థిక సహాయం అందజేసిన ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ కోశాధికారి శ్రీకాకోళ్లపు చలపతిరావు
విశ్వంభర, సూర్యాపేట: ఉన్నత చదువులకు పేదరికం అడ్డుకావద్దని ఆర్ధిక సహాయం అందజేసినట్లు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి శ్రీకాకోళ్లపు చలపతిరావు అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని సాయి సదన్ అపార్ట్మెంట్ లో ముగ్గురు పేద ఆర్యవైశ్య విద్యార్థుల ఉన్నత చదువులకు శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తం ఆధ్వర్యంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి శ్రీకాకోళ్లపు చలపతిరావు సులోచన దంపతులు రూ.30వేలు ఆర్ధిక సహాయం అందించి మాట్లాడారు.పేద ఆర్యవైశ్య విద్యార్థులకు ఎల్లప్పుడూ తాము అండగా ఉంటామని తెలిపారు.కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చేలా విద్యార్థులు కష్టపడి చదవాలని అన్నారు. ప్రతి ఒక్కరు సేవా గుణాన్ని అలవర్చుకోవాలని అన్నారు.బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న బుస్సా జ్ఞాన సాయికి రూ.15వేలు, ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వీర్లపాటి జయశ్రీకి రూ.10వేలు, ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న రాచూరి సహస్రకు రూ.5వేలు అందించారు.ఈ కార్యక్రమంలో శ్రీకాకోళ్లపు రాఘవేంద్ర, భవాని, సింగిరి కొండ సుకుమార్, శ్రీ వాసవి సేవా సమితి ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి నాగరాజు, వెంకటరమణ, విద్యార్థుల కుటుంబ సభ్యులు బుస్సా వీరకుమార్,రాచూరి పూర్ణచందర్,వీర్లపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.