సీనియర్ సిటిజన్లే సైబర్ నేరగాళ్ల లక్ష్యం
విశ్వంభర, హైదరాబాదు : హైదరాబాదులో సీనియర్ సిటిజన్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు భారీగా మోసాలకు పాల్పడుతున్నారని పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. 2025 జనవరి నుంచి 2026 జులై వరకు 19 నెలల్లో 403 కేసులు నమోదుకాగా, బాధితులు రూ.102.02 కోట్లు కోల్పోయారని వెల్లడించారు. ట్రేడింగ్ మోసాలు, డిజిటల్ అరెస్టులు, ఓటీపీ మోసాలు ప్రధానంగా ఉన్నాయని తెలిపారు. 113 ట్రేడింగ్ మోసాల్లో రూ.55.88 కోట్లు, 69 డిజిటల్ అరెస్ట్ కేసుల్లో రూ.31.93 కోట్లు, 115 ఓటీపీ మోసాల్లో రూ.4.94 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. జూబ్లీహిల్స్‌కు చెందిన 75 ఏళ్ల విశ్రాంత ఉద్యోగిని పార్ట్‌టైమ్ ఉద్యోగం, ట్రేడింగ్ పేరుతో నమ్మించి రూ.96 లక్షలు కాజేశారు. మరో ఘటనలో పోలీసు అధికారినంటూ వీడియో కాల్ చేసిన నిందితుడు 70 ఏళ్ల విశ్రాంత అధికారిని భయపెట్టి రూ.85 లక్షలు గుంజాడు. సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన కార్యక్రమాలతో 2026లో కేసులు, నష్టాలు తగ్గాయని సీపీ తెలిపారు. 2025లో 285 కేసుల్లో రూ.71.81 కోట్ల నష్టం జరగగా, 2026 జులై వరకు 118 కేసుల్లో రూ.30.20 కోట్ల నష్టం నమోదైంది. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎవరైనా బెదిరించినా నమ్మవద్దని, ప్రభుత్వ సంస్థలు ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా డబ్బులు అడగవని సజ్జనర్ స్పష్టం చేశారు. వాట్సాప్, టెలిగ్రామ్‌లో వచ్చే ఉద్యోగాలు, అధిక లాభాల పెట్టుబడి ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంకు వివరాలు, ఓటీపీ, ఆధార్, పాన్ వివరాలను ఎవరికీ ఇవ్వొద్దన్నారు. సైబర్ మోసం జరిగిన వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, వెంటనే సమాచారం అందిస్తే నగదును నిలిపివేసి తిరిగి పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.