ప్రణవాలయ ఆర్ట్స్ స్వర్ణోత్సవ వేడుకలు
విశ్వంభర, చిక్కడపల్లి : ఐదు దశాబ్దాలుగా కళా, సాంస్కృతిక సేవలను నిరంతరంగా అందిస్తున్న ప్రణవాలయ ఆర్ట్స్ సేవలు అభినందనీయమైనవని ఆధ్యాత్మిక ధర్మ ప్రచారకులు పూర్వజనానంద మాతాజీ అన్నారు. హైదరాబాదు
చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో ప్రణవాలయ ఆర్ట్స్ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు చీకోటి వినోద్ కుమార్ రచించిన 'అయ్యప్ప దీక్ష' గ్రంథాన్ని ఆవిష్కరించారు. సామాజిక సేవలో విశిష్ట కృషి చేసిన పలువురిని సత్కరించారు. డాక్టర్ నాగేశ్వరరావు జయంతి, ఎర్రబోయిన ఓం ప్రకాశ్, ఓరుగంటి గురుప్రసాద్ తదితరులు వినోద్ కుమార్ సేవలను ప్రశంసించారు. అనంతరం 'బెలూన్' నాటకం, సంగీత, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.