చేనేత కార్మికులకు చేయూత పెన్షన్‌ అందించాలి

విశ్వంభర, సూర్యాపేట: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పెన్షన్‌ పథకంలో చేనేత కార్మికులకు సమాన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూర్యాపేట చేనేత పారిశ్రామిక సహకార సంఘం డైరెక్టర్‌ యలగందుల సాయినేత ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్లు గీత కార్మికులకు సహకార సంఘ సభ్యత్వ ధ్రువీకరణ పత్రాన్నే అర్హతకు ప్రామాణికంగా గుర్తిస్తుండగా, చేనేత కార్మికులకు మాత్రం చేనేత & జౌళి శాఖ ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరి చేయడం సమంజసం కాదన్నారు. చేనేత సహకార సంఘాల్లో సభ్యుల వివరాలు, సభ్యత్వం, వృత్తికి సంబంధించిన సమాచారం అధికారికంగా నమోదు అయి ఉంటుందని, అలాంటి పరిస్థితిలో అదనపు ధ్రువీకరణ కోరడం వల్ల పేద చేనేత కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. చేనేత సహకార సంఘ సభ్యత్వ ధ్రువీకరణ పత్రాన్నే చెల్లుబాటు అయ్యే ఆధారంగా గుర్తించి, సహకార సంఘ సభ్యత్వం కలిగి 50 సంవత్సరాలు పూర్తి చేసిన అర్హులైన పేద చేనేత కార్మికులందరికీ చేయూత పెన్షన్‌ మంజూరు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై సూర్యాపేట జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించి, రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే సానుకూల నిర్ణయం తీసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

🕒 10 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/handloom-workers-should-be-provided-with-handloom-pension/article-21543

Tags: