పాఠశాల పక్కనే చెత్త కుప్పలు.. విద్యార్థుల ఇబ్బందులు

 విశ్వంభర, శంకర్ పల్లి : శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో ఉన్న ప్రాథమిక పాఠశాల పక్కనే ప్రజలు చెత్త వేస్తుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్త నుంచి వెలువడుతున్న దుర్వాసనతో విద్యార్థులు తరగతి గదుల్లో సైతం ప్రశాంతంగా కూర్చోలేకపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త పేరుకుపోవడంతో దోమలు, ఈగలు పెరిగి విద్యార్థుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది పలుమార్లు చెత్త వేయవద్దని సూచించినప్పటికీ కొందరు ప్రజలు అదే ప్రదేశంలో చెత్త వేస్తున్నారని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా ప్రజల్లో మార్పు రావాలని, పాఠశాల పక్కన చెత్త వేయకుండా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు కూడా ఈ సమస్యపై శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

🕒 10 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/garbage-piles-next-to-the-school-are-a-problem-for/article-21506

Tags: