గంజాయి తాగకండి.. పిల్లలకు సెల్‌ఫోన్లు ఇవ్వకండి

  • గంజాయి తాగకండి.. పిల్లలకు సెల్‌ఫోన్లు ఇవ్వకండి యువత, తల్లిదండ్రులకు జగ్గారెడ్డి సూచన

విశ్వంభర, సంగారెడ్డి: యువత గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. చిన్నపిల్లల చేతికి సెల్‌ఫోన్లు ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు. ఫోన్లకు బానిసలుగా మారడం వల్ల పిల్లల జ్ఞాపకశక్తి, భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందని అన్నారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆయన నివాసం నుంచి భవాని మందిర్‌ మీదుగా దుర్గమ్మ గుడి వరకు శోభాయాత్ర నిర్వహించారు. పోతరాజుల నృత్యాలు, డప్పు చప్పుళ్లు, కోలాటాలతో వేడుకలు వైభవంగా సాగాయి. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. గంజాయి వ్యసనంతో యువత జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. సిగరెట్లు, చాక్లెట్లు, బర్గర్లలో మత్తు పదార్థాలు కలిపి యువతను వ్యసనాలకు గురిచేస్తున్నారని, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.రాహుల్‌గాంధీ నాయకత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు తెలంగాణలో గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలనకు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని, అప్పుడే రేపు మన పిల్లలు కూడా మనలను బాగా చూసుకుంటారని జగ్గారెడ్డి అన్నారు.

🕒 10 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/dont-smoke-marijuana-dont-give-cellphones-to-kids/article-21577

Tags: