జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి

  • టీజేఏ సిద్దిపేట జిల్లా సమావేశం డిమాండ్‌

విశ్వంభర, సిద్దిపేట: జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలంగాణ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ (టీజేఏ) సిద్దిపేట జిల్లా సమావేశం డిమాండ్‌ చేసింది. జర్నలిస్టులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని కోరింది. సిద్దిపేట పట్టణంలోని వైశ్య భవన్‌లో ఎన్‌యూజే ఇండియా జాతీయ ఉపాధ్యక్షుడు, టీజేఏ అధ్యక్షుడు ఉక్కలకర రాజేందర్‌నాథ్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. టీజేఏ ఫౌండర్‌ ఉప్పల లక్ష్మణ్‌ ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఎన్‌యూజే ఇండియా కార్యవర్గ సభ్యుడు డి. రాజలింగం, టీజేఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఆర్‌. గౌరీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింత నీలకంఠం, సీనియర్‌ సభ్యుడు కే. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, మెరుగైన వైద్య సౌకర్యాలు, హెల్త్‌ కార్డులు అందించాలని తీర్మానించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో హెల్త్‌ కార్డుల ద్వారా వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర, జిల్లా హైపవర్‌ కమిటీలను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. జర్నలిజం రంగంలో దీర్ఘకాలంగా సేవలందించిన 75 ఏళ్లకు పైబడిన వృద్ధ జర్నలిస్టులకు ఉచిత బస్సు పాస్‌ సౌకర్యం కల్పించాలని మరో తీర్మానం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు, వృద్ధ జర్నలిస్టుల సమస్యలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సిద్దిపేట జిల్లాలో టీజేఏను మరింత బలోపేతం చేసి, జర్నలిస్టుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు జిల్లా కమిటీని పునర్వ్యవస్థీకరించాలని సమావేశం నిర్ణయించింది. జర్నలిస్టులందరూ ఐక్యంగా ఉండి తమ హక్కులు, సంక్షేమం కోసం కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. సమావేశంలో టీజేఏ నాయకులు, సభ్యులు, జిల్లాలోని పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

🕒 10 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/special-measures-should-be-taken-for-the-welfare-of-journalists/article-21567

Tags: