జైల్‌భరోను జయప్రదం చేయాలి

జైల్‌భరోను జయప్రదం చేయాలి

విశ్వంభర, హుస్నాబాద్:  ఈ నెల 10న సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించనున్న దేశవ్యాప్త జైల్‌భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీవైఎల్‌ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బానోతు సంతోష్‌నాయక్‌ పిలుపునిచ్చారు. ఆదివారం హుస్నాబాద్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతుల పంటలకు సీ2+50 శాతం ఫార్ములా ప్రకారం కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ, ప్రభుత్వ కొనుగోలు భరోసా కల్పించాలన్నారు. రైతు రుణాలను పూర్తిగా మాఫీ చేసి వ్యవసాయ కూలీలకు కనీస వేతనం, సామాజిక భద్రత కల్పించాలని కోరారు. క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్పొరేట్‌ సంస్థలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. డిమాండ్లు పరిష్కరించకపోతే రైల్‌రోకో, రాస్తారోకో వంటి ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

🕒 10 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/jail-bharo-should-be-conquered/article-21545

Tags: