కాకతీయ విశ్వవిద్యాలయ అభివృద్ధికి రూ.500 కోట్లు ప్రకటించాలి

విశ్వంభర, హనుమకొండ  : సీఎం రేవంత్‌రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రకటించిన భారీ నిధుల మాదిరిగానే కాకతీయ విశ్వవిద్యాలయ  అభివృద్ధికి రూ.500 కోట్ల ప్రత్యేక నిధులను అందించాలని కేయూ విశ్రాంత అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఏ.సదానందం డిమాండ్‌ చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవాల్లో భాగంగా ఆగస్టు 11న విశ్రాంత అధ్యాపకుల రీయూనియన్‌ రీయూనియన్‌ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విశ్వవిద్యాలయం అంటే కేవలం భవనాలు, రహదారులు కాదు. మానవ వనరులే అసలైన బలమని అన్నారు. పదేళ్లుగా అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పదవీ విరమణ చేస్తున్నప్పటికీ తగిన స్థాయిలో నియామకాలు జరగకపోవడం ఆందోళనకరంగా ఉందని తెలిపారు. వెంటనే నియామకాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సంఘం కార్యదర్శి రవీందర్‌, ప్రొఫెసర్లు , బాధ్యులు సి.హెచ్‌.సమ్మయ్య, జి.వీరన్న, కే.సుధాకర్‌, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

🕒 10 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/500-crore-should-be-announced-for-the-development-of-kakatiya/article-21569

Tags: