మహంకాళి ఆలయం లో ఘనంగా బోనాలు
విశ్వంభర, అంబర్‌పేట : ఆదివారం బోనాల వేడుకలు అంబర్ పేటలో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో మహిళలు బోనాలతో తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. మహంకాళి దేవాలయం వద్ద జరిగిన ఈ వేడుకలకు పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో తరలిరావడంతో ఆలయ పరిసరాల్లో భక్తి వాతావరణం నెలకొంది.