రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందించాలి

రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందించాలి

  • విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ధర్నా

విశ్వంభర, రామన్నపేట: రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడంతో పాటు సరిపడా త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదివారం రామన్నపేట మండల కేంద్రంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. రైతులకు 24 గంటల త్రీఫేజ్‌ విద్యుత్‌ అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం సరిపడా విద్యుత్‌ సరఫరా చేయడం లేదని విమర్శించారు. దీంతో రైతులు వ్యవసాయ పనులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అదేవిధంగా లోవోల్టేజీ సమస్యల కారణంగా వ్యవసాయ బోర్లకు సంబంధించిన స్టార్టర్లు, మోటార్లు తరచూ కాలిపోతున్నాయని, దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే రైతుల సమస్యలను పరిష్కరించి నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించాలని డిమాండ్‌ చేశారు.  అనంతరం మండల కేంద్రంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మాజీ మండల అధ్యక్షుడు బందెల రాములు, పోషబోయిన మల్లేశం, సర్పంచులు కంభంపాటి శ్రీనివాస్‌, గర్దాస్‌ విక్రమ్‌, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు రేఖ యాదయ్య, పున్న వెంకటేశం, ఎండీ అమీర్‌, జిల్లా నాయకులు కన్నెబోయిన బలరాం, బద్దుల రమేష్‌, పట్టణ కార్యదర్శి జాడ సంతోష్‌ తదితర మండల, గ్రామస్థాయి బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

🕒 10 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/quality-electricity-should-be-provided-to-the-farmers/article-21541

Tags: