సుందరయ్య పార్కులో బోనాల వేడుక 

సుందరయ్య పార్కులో బోనాల వేడుక 

విశ్వంభర, బాగ్‌లింగంపల్లి : బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయా లకు ప్రతీక అని ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఆదివారం హైదరాబాదు  బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కులో వీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు వివేక్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల వేడుకల్లో ఆయన పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుందరయ్య పార్కు అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు రమేష్‌రెడ్డి, వాకర్స్‌ కిషన్ రావు, శ్రీనివాస్ రెడ్డి, రఫీ, నరసింహ, నిమ్మ రాజశేఖర్‌, సంతోష్‌గౌడ్‌, ఎమ్మెన్‌ శ్రీనివాస్‌, ముఠా జయసింహ, కృష్ణ, కూరగాయల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

🕒 10 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bonala-celebration-at-sundarayya-park/article-21525

Tags: