పోలీస్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ కార్యక్రమం
- -దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించిన ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగా రెడ్డి
విశ్వంభర,ఇబ్రహీంపట్నం: నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలబెట్టడమే కాకుండా ఇక్కడి యువతను ఉన్నత స్థాయికి చేర్చటం కూడా తన సంకల్పమని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి తెలిపారు. జీవితంలో ఎదుగుదలకు వేసే ప్రతీ అడుగులో తమ సహకారం ఉంటుందని యువతకు ఆయన హామీ ఇచ్చారు. మల్ రెడ్డి యవశక్తి, ఎంఆర్ఆర్ ఫౌండేషన్ నేతృత్వంలో మల్ రెడ్డి అభిషేక్ రెడ్డి సారథ్యంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన పోలీస్ ఉద్యోగాల అభ్యర్థులకు ఉచిత శిక్షణ దృష్ట్యా ఆదివారం దరఖాస్తుల స్వీకరణ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ, భవిష్యత్ మొత్తం యువత చేతుల్లోనే ఉందని.వారు సరైన మార్గంలో వెళ్తేనే దేశం అన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తుందని, ఇందులో భాగంగానే ఇక్కడి యువతకు విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనపై దృష్టి సారించినట్లు తెలిపారు. అభిషేక్ నేతృత్వంలో చేపట్టిన ఈ శిక్షణ కార్యక్రమాన్ని పోలీస్ ఉద్యోగ అభ్యర్థులంతా వినియోగించుకోవాలని సూచించారు. మన జిల్లాకు పోస్టులు లేవని ఆందోళన చెందుతున్నారని, కొన్ని కారణాలతోనే ఇక్కడ ప్రక్రియ ఆగినట్లు సమాచారం ఉందన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి, వీలైనంత త్వరగా నోటిఫికేషన్ వచ్చేలా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అప్పటి వరకు సమయం వృథా చేసుకోకుండా చదువులపై దృష్టి సారించాలని సూచించారు. అభిషేక్ రెడ్డి మాట్లాడుతూ, రేపటి జీవితానికి బలమైన పునాది వేసేలా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు యువత చేస్తున్న ప్రయత్నాలకు తమ సహకారం ఎప్పటికీ ఉంటుందని తెలిపారు. సివిల్స్ స్థాయిలో రాష్ట్ర పోలీస్ ఉద్యోగాలకు పోటీ, సిలబస్ ఉన్న తరుణంలో ఎక్కడా నిర్లక్ష్యం చేయకుండా ప్రిపరేషన్ పైనే దృష్టి సారించాలని చెప్పారు. ఇందుకు నిపుణుల పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు తాము చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రాజు, సీఐ మహేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ గురునాథ్ రెడ్డి, నాయకులు భూపతిగళ్ళమహిపాల్, పాండురంగారెడ్డి, ఈసీ శేఖర్ గౌడ్, కొంగర విష్ణువర్ధన్ రెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ భాస్కరాచారి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ కౌన్సిలర్లు, ఫిజిక్స్ ఫ్యాకల్టీ రమేశ్ తో పాటు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.