జైల్ బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి 

జైల్ బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి 

విశ్వంభర, రామన్నపేట: ఆగస్టు 10న జరిగే జైల్ బరో కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి గొరిగె సోములు కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని మండల సిఐటియు కేంద్రంలో కరపత్రాన్ని ఆవిష్కరించిన సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి గొరిగె సోములు మాట్లాడుతూ, నూతనంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా 26వేల వేతనం ప్రభుత్వం అమలు పరచాలని, గ్రామ పంచాయతీ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, నూతనంగా తీసుకొచ్చిన మోటార్ వెహికల్ చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నకరికంటి రాము, జిల్లా కమిటీ సభ్యులు అప్పం సురేందర్, వంగల మారయ్య, బుడ్డ ప్రసాద్, జంపాల మహేష్, నూనె అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

🕒 10 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/jail-borough-program-should-be-successful/article-21555

Tags: