కన్నుల పండువగా లాల్‌దర్వాజా బోనాలు
విశ్వంభర, హైదరాబాదు : హైదరాబాద్ పాతబస్తీలోని లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం వైభవంగా జరిగింది. అమ్మవారికి భక్తులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించడంతో లాల్‌దర్వాజా పరిసరాలు భక్తులతో కిక్కిరిశాయి. ప్రభుత్వం తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ అమ్మవారికి బోనం, పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని మంత్రులతో పాటు ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హైదరాబాద్ బోనాలకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. హైదరాబాద్ బోనాల నిర్వహణకు ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించిందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. చివరి భక్తుడికి కూడా అమ్మవారి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. తెలంగాణలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ బోనాల ఉత్సవాలను నిర్వహిస్తోందన్నారు. అన్ని దేవాలయాల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశామని తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. హైకోర్టు న్యాయమూర్తి ఎస్. నంద సింహవాహిని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల అమ్మవారికి బంగారు బోనం సమర్పించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే ఠాగూర్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, సీపీ సజ్జనార్, డీసీపీ, అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.