ఉప సర్పంచ్ ల సంఘం  జిల్లా అధ్యక్షునిగా అంజి యాదవ్ 

ఉప సర్పంచ్ ల సంఘం  జిల్లా అధ్యక్షునిగా అంజి యాదవ్ 

విశ్వంభర, నాగారం:  ఉప సర్పంచుల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులుగా  తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం నాగారం గ్రామ ఉప సర్పంచ్ వంగూరి అంజి యాదవ్  ను.ఆదివారం హైద్రాబాద్ లో జరిగిన ఉపసర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశంలో వంగూరి అంజి యాదవ్ ను నియమిస్తూ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు లావుడ్య రాములు నాయక్ నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అంజి యాదవ్ మాట్లాడుతూ నా పై నమ్మకంతో నన్ను జిల్లా అధ్యక్షునిగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు రాములు నాయక్ కు ప్రత్యేకధన్యవాదాలు తెలిపారు.జిల్లాలో ఉప సర్పంచుల సమస్యల పరిష్కరించడానికి పాటుపడతానని,ఉప సర్పంచుల సంఘం  సమస్యల పరిష్కారానికి తనవంతుగా  కృషి చేస్తానని అని అన్నారు.

Tags: