శాలివాహనుడి స్ఫూర్తితో రాజ్యాధికారానికి పిలుపు

శాలివాహనుడి స్ఫూర్తితో రాజ్యాధికారానికి పిలుపు

విశ్వంభర, ముషీరాబాద్: శాలివాహనుడి స్ఫూర్తితో కుమ్మరులు రాజ్యాధికారం చేపట్టాలని తెలంగాణ కుమ్మర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకయ్య అన్నారు. హైదరాబాదులోని ట్యాంక్ బండ్ వద్ద శాలివాహన ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో మాట్లాడారు. శాలివాహనుడు చారిత్రక పురుషుడని, బహుజనులకు స్ఫూర్తిగా నిలిచాడని పేర్కొన్నారు. దాశరథి సాహిత్య అవార్డు గ్రహీత అన్నవరం దేవేందర్ మాట్లాడుతూ శాతవాహనుల పాలన దేశవ్యాప్తంగా విస్తరించిందన్నారు. గాజోజు నాగభూషణం శాతవాహనుల చరిత్రను వివరించగా, బుర్ల వెంకటేశ్వర్లు ప్రముఖ రాజుల గురించి ప్రస్తావించారు. నాయకులు ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శాలివాహన జయంతిని అధికారికంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో బిక్షపతి, లక్ష్మీనారాయణ, జిపి రావు, శ్యాంకుమార్, శ్రీనివాస్, రూపేష్, పూర్ణచందర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. శాలివాహన విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి నిర్వహించారు.

Tags: