వడగండ్ల వానతో కోతకు వచ్చిన వరిపంట భారీగా నష్టం

వడగండ్ల వానతో కోతకు వచ్చిన వరిపంట భారీగా నష్టం

విశ్వంభర, వలిగొండ: ఆలేరు నియోజకవర్గ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలం, నర్సపురం గ్రామంలో శనివారం రాత్రి కురిసిన అకాల వడగండ్ల వర్షానికి కోతకు వచ్చిన వరిపంట గింజ లేకుండా రాలిపోయాయని రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పు చేసి పంట వేసినట్లు తెలిపారు. దున్నకానికి, వరి నాట్లకు, దుక్కి మందులకు, తెగుళ్లు రోగాల మందులకు, పెట్టబడీ పెట్టినామని, వరి పంట కోతకు సిద్దం అయ్యింది, ఇంక కోసి నూర్పిడీ చేసి మార్కెట్లో అమ్మీ వడ్డీకి తెచ్చిన డబ్బులు చెల్లించవచ్చుననీ బావించామని, కానీ ఈ ఆకాల వడగండ్ల వర్షం వలన చేతికి అందివచ్చిన పంట నేలపాలు కావటంతో ఏమి చేయాలో పాలుపోవటం లేదని రైతులు ఆవేదనతో కన్నీటి పర్యంతమయ్యారు. ప్రజా ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. రైతులు పీసరి రాంరెడ్డిది వరిపంట 4 ఏకరాలు, పీసరి గోవర్ధన్ రెడ్డిది 2 ఏకరాలు, పీసరి లక్ష్మారెడ్డిది 2.5 ఏకరాలు, తదితర రైతులకు సంబంధించిన వరిపంట 10 ఏకరాలకు పైగా నష్టం వాటిల్లిందని వారు పత్రికల వారికి తమ ఆవేదనను తెలియజేశారు.

Tags: