నర్మెట రైతు జాతరకు నాగారం మండలం రైతులు
విశ్వంభర, నాగారం: నర్మెటలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రైతు మహోత్సవం,ఆయిల్ రిఫైనరీ ప్రారంభోత్సవ వేడుకకు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం రైతులు భారీ ఎత్తున తరలివెళ్లారు.సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు,జిల్లా వ్యవసాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.పలు గ్రామాలకు చెందిన ఆయిల్ పామ్ రైతులు ప్రత్యేక బస్సుల్లో బయలుదేరారు.ఈ పర్యటనలో భాగంగా ఆధునిక యాజమాన్య పద్ధతులు,అధిక దిగుబడి సాధించే మార్గాలపై రైతులకు నిపుణులు అవగాహన కల్పించనున్నారు. రిఫైనరీ వల్ల రైతులకు చేకూరే ఆర్థిక ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో వివరించనున్నారు.ఈ అవగాహనతో మండలంలో సాగు విస్తీర్ణం పెరిగి రైతుల జీవితాల్లో ఆర్థిక వెలుగులు నిండుతాయని వ్యవసాయ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమ లో నాగారం మండలం వ్యవసాయ అధికారికృష్ణకాంత్, వ్యవసాయ విస్తరణ అధికారులు పలు గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.



