25న జర్నలిస్టుల ‘ఛలో హైదరాబాద్’ 

25న జర్నలిస్టుల ‘ఛలో హైదరాబాద్’ 

విశ్వంభర, హైదరాబాద్: “ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా జర్నలిస్టులు ఏకమై పోరాటానికి సిద్ధమవుతున్నామ ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25న ‘ఛలో హైదరాబాదు–ఐ అండ్ పీఆర్ ఆఫీస్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం పూర్తిగా నిర్లక్ష్యం చెయ్యబడుతోందని ఆరోపించారు. బడ్జెట్‌లో జర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యం లేకపోవడం దీనికి నిదర్శనమని అన్నారు. అక్రెడిటేషన్, హెల్త్ కార్డులు ఇవ్వకపోవడం, ఇళ్ల స్థలాల విషయంలో స్పష్టత లేకపోవడం సమస్యలను మరింత పెంచుతున్నాయని తెలిపారు. చిన్న, మధ్య తరహా పత్రికలకు ప్రకటన బిల్లులు చెల్లించకపోవడం, ఎంపానల్మెంట్ ఇవ్వకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితులకు నిరసనగా నిర్వహించే కార్యక్రమంలో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Tags: