బట్రాజు సంఘం నూతన కమిటీ ఎన్నిక
విశ్వంభర, హైదరాబాద్: సంఘం అభివృద్ధికి సామాజిక బాధ్యతతో ముందుకు సాగుతామని హైదరాబాద్ జిల్లా నెంబర్ వన్ బట్రాజు సంఘం నూతన కార్యవర్గం సభ్యులు తెలిపారు. ఆదివారం ఉదయం అంబర్పేట పటేల్ నగర్‌లో పెద్దల సమక్షంలో కొత్త కమిటీని ఎన్నుకున్నారు. అంబటి బాపిరాజు, బొల్లపల్లి నరసరాజు ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. నేటి నుంచి ఐదు సంవత్సరాల పాటు ఈ కమిటీ కొనసాగనుంది. సంఘ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం కోసం కృషి చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా భాస్కర్ని నరేందర్ రాజు, ప్రధాన కార్యదర్శిగా ఏ వై గిరిరాజు, గౌరవ అధ్యక్షుడిగా డాక్టర్ బి ఎల్ ఎన్ రాజు ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా జయమ్మ, తిరుమలమ్మ, రాఘవేందర్ రాజు, కోటం రాజు, కోశాధికారిగా తంగేళ్ల నాగరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి ప్రకాష్ రాజు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా అంబటి రఘుపతి రాజు, సత్యం రాజు, లక్ష్మణ్ రాజు, వరమ్మ ఎంపికయ్యారు. కార్యక్రమంలో సంఘ పెద్దలు, సభ్యులు పాల్గొన్నారు.



