అందరి సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి
విశ్వంభర, ఇనుగుర్తి : అందరి సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని సర్పంచి తమ్మడపల్లి కుమార్ స్పష్టం చేశారు. మండల కేంద్రం ఇనుగుర్తి మేజర్ గ్రామపంచాయతీ గ్రామసభ సర్పంచి కుమార్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కొక్కటిగా అన్ని సమస్యలు పరిష్కరించుకుందామన్నారు.పంచాయతీ కార్యదర్శి లక్ష్మి కాంత్ ఆదాయవ్యయాలను వివరించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను గ్రామసభ దృష్టికి తీసుకువచ్చారు. వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి లేకుండా చూడాలని, మురుగు కాలువలను క్లీన్ చేయాలని,పారిశుధ్యం పట్ల నిర్లక్ష్యం వహించవద్దని పలువురు గ్రామస్తులు సూచించారు.గ్రామంలో దోమల నివారణకు చేపట్టిన ఫాగింగ్ ఎందుకు కంప్లీట్ చేయలేదని వెంటనే పూర్తి చేయాలని కోరారు. గ్రామం నుంచి అన్నారం వైపు వెళ్లే రోడ్డు టెండర్ జరిగే విధంగా పలుకుబడిని ఉపయోగించి రోడ్డు పనులు పూర్తి చేయాలని పలువురు కోరారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో గ్రామ సభ కు హాజరు కాకపోవడం పట్ల పెదవి విరిచారు.నీటి సమస్య, పారిశుధ్యం, తదితర సమస్యలపై తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ యాదగిరి, దిశ కమిటీ సభ్యులు గుజ్జునూరి బాబురావు, బిల్ కలెక్టర్ ఉమ్మగాని మధుసూదన్,వార్డు సభ్యులు వేముల శ్రీనివాస్ గౌడ్,పరుశురాం,చిన్నాల ప్రశాంత్,గుజ్జునూరి శ్రీకాంత్ వివిధ పార్టీల నాయకులు దీకొండ వెంకన్న గౌడ్,చిన్నాల కట్టయ్య యాదవ్ తో పాటు పలువురు గ్రామస్తులు అంగన్వాడీ టీచర్లు,ఏఎన్ఎంలు,వైకెపి బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.



