26న ఛలో అసెంబ్లీ

26న ఛలో అసెంబ్లీ

విశ్వంభర, బాగ్ లింగంపల్లి: నిరుద్యోగ యువతకు ఉద్యోగాల భర్తీ కోసం తక్షణమే నోటిఫికేషన్స్ విడుదల చేయాలని డివైఎఫ్ఐ, నిరుద్యోగ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. మార్చి 26న జరిగే ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పోస్టర్లు విడుదల చేసిన సందర్భంగా, ఎన్నికల హామీలైన జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి అమలు కాలేదని విమర్శించారు. వెంటనే ఉద్యోగాల భర్తీ చేపట్టి, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోట రమేష్, ఆనగంటి వెంకటేష్, ఆర్.ఎల్. మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags: