ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి 

ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి 

విశ్వంభర, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలో  కోర్టు నుండి భగత్ సింగ్ విగ్రహం వరకు ప్రగతిశీల యువజన సంఘం పి వై ఎల్  ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు . ఈ సందర్భంగా  ప్రగశీల యువజన సంఘం పివైఎల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, సామ పాపయ్య, బట్టు చైతన్య లు ప్రసంగిస్తూ దేశంలో మతోన్మాదం పేరుతో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి యువజన విద్యార్థి , వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశంలో రాష్ట్రంలో నిరుద్యోగ, సమస్య పరిష్కారానికై ప్రతి ఒక్కరు, యువతరం, భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమించాలని అన్నారు.  ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్పొరేట్ కి  వ్యతిరేకంగా యువతరం ఉద్యమించాలని, పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో పీవెల్ జిల్లా నాయకులు తెలబోయిన కృష్ణ, అలీ, ఏకాంబరం, స్టాలిన్, మహేష్, బాబు సింగ్ ,తదితరులు పాల్గొన్నారు .

Tags: