శ్రీ సీతారాముల శోభాయాత్రను విజయవంతం చేయాలి 

శ్రీ సీతారాముల శోభాయాత్రను విజయవంతం చేయాలి 

విశ్వంభర, అంబర్‌పేట : శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 27న అంబర్‌పేట మున్సిపల్ మైదానం నుంచి నిర్వహించే శ్రీ సీతారాముల శోభాయాత్రకు భక్తులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఉత్సవ సమితి కన్వీనర్ డాక్టర్ ఎన్. గౌతమ్ రావు పిలుపునిచ్చారు. మహంకాళి దేవాలయం వద్ద భక్తులకు ఆహ్వాన పత్రాలు పంపిణీ చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే శోభాయాత్ర వివిధ ప్రాంతాల గుండా వీర సావర్కర్ విగ్రహం వరకు వైభవంగా సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుగ్గిళ్ల శ్రీనివాస్, కృష్ణ గౌడ్, అజయ్ కుమార్, నాగరాజు చారి, జగన్, దత్తు, లలితా అనంతరాజు గౌడ్, మల్లేష్, రఘునందన్, విజయ్ శేఖర్, రామ్ రెడ్డి, రవీందర్, బాలకృష్ణ గౌడ్, సుగుణ, రాము, మిర్యాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags: