బతుకమ్మ కుంట పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలి
On
విశ్వంభర, అంబర్‌పేట : బాగ్ అంబర్‌పేట డివిజన్‌లోని బతుకమ్మ కుంటను ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పరిశీలించారు. కుంటలో నిల్వ ఉన్న మురికి నీటిని తొలగించి, శుభ్రమైన నీటిని నింపాలని అధికారులను ఆదేశించారు. కలుషిత నీటితో దోమలు పెరిగి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని పేర్కొన్నారు. పరిసరాల్లో శుభ్రత మెరుగుపరచడంతో పాటు రోడ్లు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.



