మహదేవపూర్‌లో ప్రచార రథం ప్రారంభం
On
విశ్వంభర, మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక పశువైద్యశాలలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలపై అవగాహన కల్పించే ప్రచార రథాన్ని ఈరోజు భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, గ్రామపంచాయతీ సర్పంచ్ హసీనా భాను జెండా ఊపి ప్రారంభించారు. మార్చి 24 మరియు 25 తేదీలలో మహదేవపూర్ మండలంలోని అన్ని గ్రామపంచాయతీలలో ప్రచార రథం ద్వారా రైతులకు అవగాహన కల్పించబడుతుంది. ఈ కార్యక్రమంలో పశువుల ఆరోగ్యం, పాల ఉత్పత్తి పెంపు, వ్యాధి నివారణ వంటి అంశాలపై వివరంగా చైతన్యం కల్పించబడుతుంది. మహదేవపూర్ మండలంలో సుమారు 12,000 పశువులకు టీకాలు వేయడం లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి అన్ని గ్రామాలలో విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. గాలికుంటు ఒక వైరల్ వ్యాధి. ఇది ముఖ్యంగా ఆవులు, ఎద్దులు, మేకలు, గొర్రెలలో వ్యాపించి, నోరు, కాళ్లు, చనుమొనలపై గాయాలు కలిగిస్తుంది. దీని వల్ల పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడంతో పాటు, రైతులకు ఆర్థిక నష్టం కలుగుతుంది. కాబట్టి ప్రతి పశువుకు నిర్దిష్ట కాలంలో టీకా వేయడం అత్యంత అవసరం. గాలి కుంటు వ్యాధి పశువుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు రైతులకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి. ప్రభుత్వం చేపట్టిన ఈ టీకాల కార్యక్రమాన్ని ప్రతి రైతు వినియోగించుకోవాలి. అన్ని గ్రామాల్లో 100 శాతం టీకాలు జరిగేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేయాలి. మా గ్రామంలోని ప్రతి పాడి రైతులకు ఈ గాలికుంటు టీకాల కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనేలా చర్యలు తీసుకుంటాం. పశువుల ఆరోగ్యం కాపాడడం ద్వారా రైతుల ఆదాయం పెరుగుతుంది. గ్రామస్థులు అందరూ అవగాహన కలిగి టీకాలు వేయించుకోవాలి. మార్చి 24న మహదేవపూర్, బ్రాహ్మణపల్లి, బొమ్మాపూర్, ఎల్కేశ్వరం, బేగ్లూర్, సురారం, రాపల్లి కోట, ఏన్కపల్లి, అంబటిపల్లి, పెద్దంపేట గ్రామాలు. ఇంచార్జీ ఆఫీసర్ కె. నాగభూషణం, మార్చి 25న ఎడపల్లి, కుదురుపల్లి, కాళేశ్వరం,మెట్పల్లి , మద్దులపల్లి, పాల్గుల, చంద్రుపల్లి, అన్నారం, మహదేవపూర్ గ్రామాలు. ఇంచార్జీ ఆఫీసర్ ఎమ్. తిరుపతి, ప్రతి గ్రామంలో నిర్ణయించిన సమయానికి ప్రచార రథం చేరుకొని రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది, పాలుపంచుకొని తమ పరిధిలోని గ్రామంలో ఈ రథానికి ఆహ్వానం పలకాలని కోరడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రాజబాబు సిబ్బంది నాగభూషణం, లావణ్య పాల్గొన్నారు.



