సకాలంలో పరిశ్రమలకు అనుమతులు ఇవ్వాలి
On
- జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
విశ్వంభర, సూర్యాపేట: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు సకాలంలో అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో డీఐపీసీ, టీఎస్ ఐపాస్ కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తపరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తులను పరిశీలించి సింగల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేయాలన్నారు. జిల్లాలో 36 పరిశ్రమలకు గాను 63 అప్రూవల్స్ వివిధ శాఖల ద్వారా వచ్చాయని వాటిని అధికారులు క్షేత్ర స్థాయి లో పరిశీలించి సంబంధిత అధికారులు నిబంధనల మేరకు ఆమోదించాలని కలెక్టర్ సూచించారు. ఎస్సీ, ఎస్టీ సంబంధించిన టీఫ్రైడ్ పథకం కింద 82 యూనిట్లు మంజూరు చేస్తూ తీర్మానించామన్నారు. సమావేశం లో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ టి. సీతారాం, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ బి. యాదగిరి,డి.పి.ఓ. కె. యాదగిరి , యస్. సి డెవలప్మెంట్ అధికారి దయానంద రాణి, యస్. టి డెవలప్మెంట్ అధికారి కె. శంకర్, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి ఇతర అధికారులు పాల్గొన్నారు.



