బ్యాంకర్లు లక్ష్యాన్ని చేరుకోవాలి
On
- ఆర్బీఐ అసిస్టెంట్ మేనేజర్ లక్ష్మీశ్రావ్య
విశ్వంభర, పెద్దశంకరంపేట: బ్యాంకర్లు నిర్దేశించిన రుణ లక్ష్యాన్ని చేరుకోవాలని ఆర్బీఐ అసిస్టెంట్ మేనేజర్ లక్ష్మీశ్రావ్య అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్, పెద్దశంకరంపేట మండలాలకు చెందిన పలు బ్యాంకర్లతో పాటు ఐకెపి సిబ్బంది, వ్యవసాయ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. యువతకు, మహిళలకు, రైతులకు, ప్రజలకు సంభందించిన రుణాలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ, ఇతర రుణాలను సక్రమంగా అందించాలని సూచించారు. రుణాల మంజూరుతో పాటు రికవరీ కూడా చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎల్డీఎం బాపూజీ, ఎంపీడీఓ క్రాంతికుమార్, ఎస్బీఐ మేనేజర్ చైతన్య, యూనియన్ బ్యాంకు మేనేజర్ వెంకటేశం, ఏఓలు కృష్ణ, రాజేశ్, ఏపియంలు, సీసీలు పాల్గొన్నారు.



