అఖిలపక్షం పేరుతో బాలరాజు గౌడ్ అక్రమ వసూలు

అఖిలపక్షం పేరుతో బాలరాజు గౌడ్ అక్రమ వసూలు

  •  పొన్నం నీలిమ రవి గౌడ్

 విశ్వంభర, బోడుప్పల్: మాపై అనుచిత వ్యాఖ్యలు  చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, తమపై వేలుఎత్తి చూపే అధికారం మీకు ఎవరిచ్చారని, మేము చేసిన అన్యాయాల ఏంటో చూపించాలని పొన్నం నీలిమ రవి గౌడ్ ప్రశ్నించారు. బోడుప్పల్ అఖిలపక్ష కమిటీ పేరుతో అక్రమ వసూలు చేపట్టడం ,బెదిరింపులకు గురిచేసే వ్యక్తి ఎలగోని బాలరాజు గౌడ్ అని, ఆయన అవినీతి చరిత్ర బోడుప్పల్ ప్రజలందరికీ తెలుసు అని బోడుప్పల్ మాజీ ఎంపీటీసీ పొన్నం నీలిమ రవి గౌడ్ ఆరోపించారు. ఈ మేరకు బోడుప్పల్ లోని తమ నివాసంలో  మంగళవారం భర్త పొన్నం రవి గౌడ్ తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. బోడుప్పల్లో ఎల్లగొని బాలరాజు గౌడ్ చేస్తున్న అవినీతి అక్రమాలను వెల్లడించారు.  గత కొన్ని రోజుల క్రితం నుంచి  ఎలగోని బాలరాజు గౌడ్ అనే వ్యక్తి తన కుటుంబానికి సంబంధం లేని విషయాలను ప్రస్తావిస్తూ తమపై నిరాధారమైన ఆరోపణ చేస్తున్నారని, సదురు ఆరోపణలకు రుజువులు చూపాలని, లేని పక్షంలో న్యాయపరంగా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బోడుప్పల్ గౌడ సంఘానికి చెందిన షట్టర్లను ఇంద్ర నగర్ సొసైటీకి ఏనాడో అప్పగించానని ,వాటి కిరాయి ఏడుసంవత్సరాల నుండి ఎవరు తీసుకుంటున్నారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. బోడుప్పల్ గౌడ సంఘానికి సంబంధించిన ఆస్తుల పై బాలరాజు గౌడ్ తో పాటు మరికొందరు వ్యక్తులు వ్యక్తిగత ఆరోపణలు చేయడం వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాలను త్వరలోనే బట్టబయలు చేస్తామని స్పష్టం చేశారు. తమ తాతల తరాల నుండి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న తమపై ఇంతవరకు ఏ రోజు కూడా అవినీతి భూకబ్జా ఆరోపణలు రాలేదని నిష్పక్షపాతంగా ప్రజాసేవలో కొనసాగమని, రాజకీయాల కోసం తమ ఆస్తులను త్యాగం చేశామని కానీ, ఏ రోజు అక్రమ సంపాదన పై ఆధారపడలేదన్నారు. రాజకీయ నాయకులు అని చెప్పుకుంటూ ఇండ్ల పైకి రావడం సిగ్గుచేటు అన్నారు. దాడులకు, దౌర్జన్యాలకు అమాయకుల ఇండ్లపై వస్తే తగిన బుద్ధి చెప్తామని పొన్నం నీలిమ రవి గౌడ్ హెచ్చరించారు.నీతి వాక్యాలు చెప్పే బాలరాజు గౌడ్ తన కూతుర్ల ఇద్దరికీ సొసైటీలో ఏ కేటగిరి సభ్యత్వం ఇచ్చుకొని  తన అక్క,చెల్లెలను ఎందుకు విస్మరించారో సమాధానం చెప్పాలని పొన్నం రవి గౌడ్ డిమాండ్ చేశారు. సొసైటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారన్న సంగతి తెలియని బాలరాజు సొసైటీనీ ఏ విధంగా నడుపుతారని రవి గౌడ్ ప్రశ్నించారు. తనవారికి ఒక న్యాయం ఇతరులకు మరొక న్యాయం చేస్తూ సొసైటీకి చెడ్డ పేరు తెస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇకనుంచి సొసైటీలో రెండు కేటగిరీలు లేవని, అందరికీ సమాన న్యాయం,సమాన వాటాలు పంచే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.తమపై ఆరోపణలు చేసే ముందు బాలరాజు గౌడ్ పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలని తన జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని పొన్నం రవి గౌడ్ హెచ్చరించారు.

Tags: