కృష్ణమోహన్‌కు వంశీ అవార్డు

కృష్ణమోహన్‌కు వంశీ అవార్డు

విశ్వంభర, చిక్కడపల్లి : హైదరాబాదు చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో వంశి ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది పురస్కారాల వేడుక సందర్భంగా కృష్ణమోహన్ కుప్పాను సత్కరించారు. ఈ సందర్భంగా వంశీ సీల్ వెల్ వ్యాఖ్యాన రత్న అవార్డును అందజేశారు. అలాగే ఉత్తమ జర్నలిస్టుగా సేవలకు గాను జగ్గయ్య వంశీ అవార్డును కూడా ప్రదానం చేశారు. వివిధ కార్యక్రమాల్లో తనదైన వ్యాఖ్యాన శైలితో శ్రోతలను రంజింప చేస్తున్న ఆయన ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్ నగరంలో స్టార్ 9 టీవీ చానెల్‌లో స్పెషల్ కరస్పాండెంట్‌గా సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా అతిథులుగా పాల్గొన్న గుత్తా సుఖేందర్ రెడ్డి, రమణ చారి మాట్లాడుతూ,  వ్యాఖ్యాన రంగంలో ఆయన ప్రతిభ విశేషమని కొనియాడారు. అనంతరం అతిథులను వంశీ రామరాజు సత్కరించారు. కార్యక్రమంలో కళాకారులు, సాహితీ ప్రముఖులు, ఆహ్వానితులు పాల్గొన్నారు.

Tags: