మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి

మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి

విశ్వంభర, ముషీరాబాదు  : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు గ్రేటర్ మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సి కార్మికులందరినీ తక్షణమే పర్మినెంట్ చేయాలని సీఐటియూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ మున్సిపల్ వర్క అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాదు ఇందిరాపార్కు ధర్నాచౌక్ లో మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్య అతిధిగా హాజరై పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులకు 8 గంటల పని విధానం అమలుచేయాలని, రెండవ పీఆర్సీలో కనీస వేతనం 26వేలుగా నిర్ణయించాలని మాండ్ చేశారు. వివిధ విభాగాలలో పనిచేస్తున్న వారి అర్హతలను బట్టి ప్రమోషన్లు కల్పించాలని, రాత్రి డ్యూటీ చేసే వారికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించాలని, రెస్ట్ ు ఏర్పాటుచేయాలని సూచించారు. మున్సిపల్ కార్మికులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇండ్ల స్థలాలు కేటాయించాలని పెరుగుతున్న పట్టణ విస్తరణకు అనుగుణంగా కొత్త సిబ్బందిని నియమించాలని, చనిపోయిన కార్మికులు లేదా వయస్సు పైబడిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను నియమించి డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ పాలడుగు సుధాకర్, టి.ఉప్పలయ్య, ప్రకాష్, అశోక్, రాజనర్సు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags: