అక్రమ సిలిండర్ల వినియోగంపై దాడులు
On
విశ్వంభర, చింతపల్లి : చింతపల్లి మండలంలోని గొడకొండ్ల (వెంకటేశ్వర నగర్) పట్టణంలో మంగళవారం పలు వ్యాపార సముదాయాల్లో అక్రమంగా వినియోగిస్తున్న గృహ వినియోగ (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్లపై సివిల్ సప్లైస్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ మెరుపు దాడులు నిర్వహించింది. పట్టణంలోని చికెన్ సెంటర్లు, హోటళ్లలో నిబంధనలకు విరుద్ధంగా గృహ అవసరాల కోసం కేటాయించిన సిలిండర్లను వాడుతున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో భాగంగా మొత్తం 40 సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భద్రతా కారణ దృష్ట్యా వీటిని స్థానిక హెచ్పి గ్యాస్ గోదాంకు తరలించి, అక్కడ భద్రపరిచినట్లు అధికారులు తెలిపారు. నిబంధనలు అతిక్రమించి కమర్షియల్ అవసరాల కోసం డొమెస్టిక్ సిలిండర్లను వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు. ఈ తనిఖీల్లో సివిల్ సప్లైయ్ ఓఎస్డీ బోడిగే అంజయ్య, ఎండీ.కమాల్ పాషా, డిటీ సివిల్ సప్లయ్స్ ఎస్డీ ముబీన్, డిటిసిఎస్ ఎ.దీపక్, ఎ.సైదులు, కుమార్ రెడ్డి, ఆర్.సైదులు డిటిసిఎస్ టాస్క్ఫోర్స్ సిబ్బంది సైదులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



