బడిబాట కార్యక్రమాన్ని జయప్రదం చేయండి
On
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం సిరిగిరి పురం గ్రామంలో ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిరిగిరిపురం గ్రామ సర్పంచి కృష్ణవేణి శీను ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. సర్పంచి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సమావేశం పాఠశాల ముందస్తు బడిబాట కార్యక్రమ కరపత్రాలను బ్రోచర్లను ఉపాధ్యాయుల, గ్రామ పాలకవర్గ సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలకు దీటుగా తయారు చేసే విధంగా పాఠశాలకు ఏ అవసరం వచ్చినా తన వంతు సహాయ సహకారాలు పూర్తిస్థాయిలో ఉంటాయని ఈ సందర్భంగా సర్పంచ్ హామీ ఇచ్చారు పాఠశాలకు వచ్చే పేద మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన గుణాత్మమైన విద్యను అందించాలని ఈ సందర్భంగాఉపాధ్యాయులకు పలు విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు,ఈ కార్యక్రమంలో సిరిగిరిపురం గ్రామ పాలకవర్గం, పంచాయతీ సెక్రెటరీ పాఠశాల యాజమాన్యం పాల్గొన్నారు.



