ఖర్మ కాండ భవన్ కొరకు స్థల పరిశీలన
On
విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ సమీపం లో పేద ఆర్యవైశ్యులు మరణిస్తే వారి ఖర్మ కాండల కొరకు మంగళ వారం జిల్లా ఆర్య వైశ్య మహాసభ ఉపాధ్యక్షులు రాచకొండ శ్రీనివాసు ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మిత్రులు స్థల కొనుగోలు కొరకు పరిశీలించారు. ఈ సందర్బంగా పలువురు ఆర్య వైశ్య మిత్రులు మాట్లాడుతూ, అగ్ర కుల ఆర్యవైశ్యులలో కూడా ఎంతో మంది పేద ఆర్యవైశ్యులు ఉన్నారని,సొంత ఇండ్లు లేక అద్దె ఇళ్లలో ఉంటూ జీవనాన్ని కొనసాగుతున్నారని తెలిపారు. కుటుంబ సభ్యులలో ఎవరైనా మరణిస్తే అద్దె యజమానులు దహన సంస్కారాలకు అంగీకరించక పోవడంతో ఎన్నో ఇబ్బందులకు గురై తున్నారని,వారి కొరకు కర్మకాండ భవన్ నిర్మించినట్లు ఐతే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.ఆధ్యాత్మిక, సమాజ సేవ,దాన ధర్మాల్లో ముందు ఉండే ఆర్యవైశ్యులు పేద ఆర్య వైశ్యుల కొరకు నిర్మించే ఈ భవన్ కు ఆర్ధికంగా ఉన్న ఆర్య వైశ్యులు సహరించాలని తెలిపారు.స్థలం పరిశీలించిన వారిలో ఆర్య వైశ్య నాయకులు రాచకొండ శ్రీనివాస్ కలకోట లక్ష్మయ్య ,బెలిదే శ్రీనివాసు బిక్కుమల్ల కృష్ణ, వెంపటి శబరినాథ్ వంగవీటి రమేష్, బచ్చు పురుషోత్తం, సోమా ప్రవీణ్ కుమార్,శ్రీరంగం రాము,యమా సంతోష్,మంచాల చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.



