చేపూరి కి స్వర మాధురి స్వర్ణ నంది అవార్డు
On
విశ్వంభర, చిక్కడ పల్లి : చిక్కడ పల్లిలోని త్యాగరాయ గానసభలో స్వర మాధురి సాహితీ సాంస్కృతిక సేవా సంస్థ నిర్వాహకురాలు సాయి పావని ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా నిరంతరం ప్రజాసేవలో ఉంటు సమాజానికి సేవలు చేస్తున్న మదర్ తెరిస్సా చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు చేపూరి శంకర్ కు నిర్వాహకులు స్వర మాధురి స్వర్ణనంది ఉగాది అవార్డు-2026 ప్రకటించారు. ముఖ్యఅతిథి హాజరైన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకులభరణం కృష్ణ మోహన్ రావు చేతుల మీదుగా స్వర మాధురి స్వర్ణ నంది ఉగాది పురస్కారాలు 2026 అవార్డును చేపూరి శంకర్ అందుకున్నారు. శంకర్ చేపట్టిన సేవా కార్యక్రమాలు చేపట్టారని ఆయన కొనియాడారు. తలసేమియా బాధితుల కోసం నిరంతరం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వంశీ ఇంటర్నేషనల్ అధినేత డాక్టర్ వంశీ రామరాజు, దైవాజ్ఞ శర్మ, సమాజ సేవకులు కె గిరి, కె సంజయ్ కుమార్, శ్రీశైలం వ్యాఖ్యాత గాంధీ,తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



