వైభవంగా సీతారాముల పల్లకి సేవ  

వైభవంగా సీతారాముల పల్లకి సేవ  

 విశ్వంభర, పెద్ద శంకరంపేట:  శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకొని పెద్ద శంకరంపేటలో రామాలయం నుండి పట్టణ పురవీధుల గుండా సీతారాముల పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. మంగళవారం ఉత్సవాలలో భాగంగా రామాలయం నుండి పట్టణ పురవీధుల గుండా ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిపై సీత రామ లక్ష్మణుల ఆంజనేయ స్వామి విగ్రహాల నుంచి భక్తులు భజనలు కీర్తనలు చేస్తూ పలికి సేవ నిర్వహించారు. మహిళలు భక్తులు సీతారాముల పల్లకి సేవకు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రామాలయ కమిటీ అధ్యక్షుడు గుజ్జరి కనకరాజు బాధ్యులు రాగం సిద్దేశ్వర్ కందుకూరి రవీందర్ అన్నారం సత్యనారాయణ  అనిల్ సాయిలు సుభాష్ గౌడ్ అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags: