ఇంపాక్ట్ మోటివేషనల్ స్పీకర్ గా నక్క మహేష్
On
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం తుక్కుగూడ జిహెచ్ఎంసి రావిరాల గ్రామకు చెందిన నక్క మహేష్ మోటివేషనల్ స్పీకర్గా ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో శిక్షణ పొందారు, శని, ఆదివారాలలో నల్గొండ లోని ఒక ప్రైవేటు హోటల్లో జరిగిన కార్యక్రమంలో నేషనల్ హెడ్ బోర్డ్ మెంబర్ నూనె సుదర్శన్ చేతుల మీదుగా మోటివేషనల్ స్పీకర్ గా సర్టిఫికెట్ ను అందుకున్నారు, ఈ కార్యక్రమంలో రీజియన్ 2 ప్రెసిడెంట్ కోట్ల సాయికిరణ్, కోటా సరిత నారాయణ కవిత, గూడూరు అంజిరెడ్డి, వీరవెల్లి శ్రీలత, హర్షిత, రవీంద్ర చారి, బాలు, సరిత మొదలగు ట్రైనర్లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నక్క మహేష్ మాట్లాడుతూ విద్యార్థులు యువతకి ప్రేరణ కలిగించి వారి లక్ష్యాలు సాధించే విధంగా జ్ఞాన నైపుణ్యాలు అందించడం, సమాజ సేవతో దేశాభివృద్ధిలో పాల్గొనడం తన కర్తవ్యం అని తెలిపారు.ఈ సందర్భంగా శిక్షణ పొందిన 30 ట్రైనర్లు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు గురూజీ గంపా నాగేశ్వరరావు కి నక్క మహేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.



