68 మద్యం బాటిళ్లు స్వాధీనం
On
విశ్వంభర, శంషాబాద్ : ఢిల్లీ, గోవా ప్రాంతాల నుంచి అక్రమంగా మద్యం రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు ఎస్టిఎఫ్ సి అండ్ డి సిఐలు వెంకటేశ్వర్ రెడ్డి, నాగరాజు సిబ్బంది పహాడ్ షరీఫ్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 68 నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మద్యం విలువ సుమారు రూ.1.36 లక్షలుగా అంచనా వేశారు. స్వాధీనం చేసిన మద్యం బాటిళ్లను మీర్పేట్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు.



