28న జాతీయ లోక్ అదాలత్‌

28న జాతీయ లోక్ అదాలత్‌

విశ్వంభర, సిద్దిపేట: ఈనెల 28తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సీపీ రష్మీ పెరుమాళ్ మంగళవారంనాడొక ప్రకటనలో సూచించారు. చిన్న చిన్న కంపౌండబుల్ కేసుల్లో కోర్ట్ చుట్టూ తిరుగుతున్న ప్రజలకు ఇదొక మంచి అవకాశమని తెలిపారు. సివిల్, ఆస్తి, కుటుంబ, రోడ్డు ప్రమాదాలు, డ్రంకెన్ డ్రైవ్, న్యూసెన్స్, చెక్ బౌన్స్ కేసుల్లోని నిందితులు, ఫిర్యాదుదారులు సంబంధిత పోలీస్ స్టేషన్, న్యాయస్థానాన్ని నేరుగా సంప్రదించాలని సూచించారు. చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృధా చేసుకోవద్దని చెప్పారు. జ్యుడీషియల్ అవకాశాన్ని ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, పోలీస్ అధికారులు రాజీ పడదగిన కేసులను గుర్తించి ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం అందుతుందని తెలిపారు.

Tags: