వ్యాస రచన పోటీలు

విశ్వంభర, బాగ్ లింగంపల్లి: మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం సంయుక్తంగా ‘కుల నిర్మూలన’ అంశంపై రాష్ట్రస్థాయి వ్యాస రచన పోటీలను నిర్వహిస్తున్నాయి. ఏప్రిల్ 11 నుండి 14 వరకు బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులు, యువత పాల్గొనేలా వ్యాస రచన పోటీలు ఏర్పాటు చేశారు. అంశం: కుల నిర్మూలన ఆవశ్యకత, చివరి తేదీ: మార్చి 31, పంపవలసిన విధానం: వాట్సాప్ / ఈమెయిల్, వాట్సాప్ నంబర్: 9059752223, ఈమెయిల్: sundarayyavignanakendram@gmail.com కు ఆసక్తి గల వారు పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.

Tags: