అక్రమ అరెస్ట్ లతో ఉద్యమాలను అణచివేయలేరు

అక్రమ అరెస్ట్ లతో ఉద్యమాలను అణచివేయలేరు

విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలోని బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని భగ్నం చేయాలని దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని మహేశ్వరం పోలీసులు మహేశ్వరం మండల్  బిఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కు  తరలించడం జరిగింది.  బి ఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ,  మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలు దేరిన బిఆర్ఎస్ పార్టీ అరెస్టు చేయడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం మండల యూత్ అధ్యక్షుడు దయ్యాలశ్రీనివాస్,మహేశ్వరం మండల పి.ఏ.సి.ఎస్ డైరెక్టర్ కాడమోని ప్రభాకర్, మాజీ కో-ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఆదిల్ అలీ, ఎండి  తాండ మాజీ సర్పంచ్ మెగావత్ రాజు నాయక్ లను మహేశ్వరం పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Tags: