క్షయ పై  విద్యార్ధులకు అవగాహన కార్యక్రమం

క్షయ పై  విద్యార్ధులకు అవగాహన కార్యక్రమం

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో వరల్డ్ టీబీ డే సందర్బంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా  మండల వైద్యాధికారి డాక్టర్ అశ్విని కుమార్ మాట్లాడుతూ,  క్షయ  రోగులలో మైకో బాక్టీరియమ్ ట్యూబర్క్యూలోసిస్ అనే బాక్టీరియాతో తుమ్మడం, దగ్గడం, మాట్లాడటం  వలన తుంపరులతో ఒకరి నుండి ఇంకొకరికి  వ్యాపించే అంటూ వ్యాధి అని, క్షయ వ్యాధి పైన అవగాహన, వ్యాధి లక్షణాలు, గుర్తించు విధానం, పూర్తి చికిత్స, పోషకాహారం, వ్యక్తిగత శుభ్రత, మాస్కులు ధరించుట, క్షయ రోగుల పట్ల ఆధరాభిమానాలు చూపించాలన్నారు.  పూర్తి చికిత్స తీసుకునేటట్లు చూడవలసిందిగా తెలియజేసి విద్యార్తులచే ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎన్.ఎం మంజుల, హెడ్ మాస్టర్ ఎం.శేషచారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: