లంకల దీపక్ రెడ్డి జన్మదిన వేడుకలు

లంకల దీపక్ రెడ్డి జన్మదిన వేడుకలు

విశ్వంభర, బర్కత్ పుర : బీజేపీ హైదరాబాదు సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి జన్మదిన వేడుకలు బర్కత్ పుర లోని 
జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గౌతమ్ రావు మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నాయకత్వాన్ని అభినందించారు. జిల్లా పదాధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని జన్మదినాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ఏడెల్లి అజయ్ కుమార్, ప్రేమ్ కుమార్, కన్నె  రమేష్ యాదవ్, శ్యామ్ రాజ్, పవన్ కుమార్, సూర్య ప్రకాష్ సింగ్, కుంభాల గంగరాజు, భుజేందర్, రజని, ఎక్కాల కన్నా, శ్రావణ్ యాదవ్, రవీందర్, మాజీ కార్పొరేటర్లు ఉమా రమేష్ యాదవ్, డి. అమృత తదితరులు పాల్గొన్నారు.

Tags: