నేడు మెగా హెల్త్ క్యాంపు 

నేడు మెగా హెల్త్ క్యాంపు 

విశ్వంభర, చింతపల్లి : ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు చింతపల్లి మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రమంలో బుధవారం స్పెషలిస్ట్ వైద్యులచే మెగా హెల్త్ క్యాంపు నిర్వహించనున్నట్లు మండల వైద్యాధికారిని డా. శ్రీదేవి తెలిపారు. మంగళవారం ఆమె విడుదల చేసిన ప్రకటనలో జనరల్ ఫిజీషియన్, ఆర్థోపెడిక్, పిడియాట్రిక్, డెంటల్, గైనకాలజిస్టు, కంటి వైద్యులచే ట్రీట్మెంట్, సలహాలు, రక్త పరీక్షలు చేయనున్నట్లు ఆమె తెలిపారు. మండల పీహెచ్సీ పరిధిలోని ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులు, వివిధ పార్టీల నాయకులు, సమాజ సేవకులు, తమ తమ గ్రామాలలో సమాచారం అందించి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆమె కోరారు.

Tags: