షాపింగ్ మాల్స్‌పై చర్యలు తీసుకోండి

షాపింగ్ మాల్స్‌పై చర్యలు తీసుకోండి

విశ్వంభర, సిద్దిపేట: జిల్లా కేంద్రంలోని పలు ప్రయివేట్, కార్పొరేట్ షాపింగ్ మాల్స్‌ల్లో పనిచేస్తున్న కార్మికులను యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పుల్లూరు ఉమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీ ఆధ్వర్యంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ శ్రీనివాస్ రావుకు మంగళవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఉమేశ్ మాట్లాడుతూ కస్టమర్లు లేని సమయంలో కూడా మహిళా కార్మికులను కనీసం కూర్చొనివ్వడం లేదని మండిపడ్డారు. కార్మికుల హక్కులను తుంగలో తొక్కుతూ యజమాన్యాలు అరాచకంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న ప్రయివేట్, కార్పొరేట్ యజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిచో షాపింగ్ మాల్స్‌ల ఎదుట బైఠాయిస్తామని హెచ్చరించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో అసెంబ్లీ అధ్యక్షుడు కొండపలకల సంపత్, హుస్నాబాద్ అసెంబ్లీ అధ్యక్షుడు వేల్పుల రాజు, గజ్వేల్ అసెంబ్లీ అధ్యక్షుడు కొమ్ము చంద్రం, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి బండారి శంకర్, అసెంబ్లీ కార్యదర్శి నాగరాజు, గజ్వేల్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి ఆశని కనకప్రసాద్, స్థానిక బీఎస్పీ నాయకులు ఉన్నారు.

Tags: