మైనర్లు డ్రైవింగ్ చేయడం చట్ట విరుద్ధం

మైనర్లు డ్రైవింగ్ చేయడం చట్ట విరుద్ధం

 విశ్వంభర, త్రిపురారం :   మైనర్లు డ్రైవింగ్ చట్ట విరుద్ధమని ప్రాణాలకు ప్రమాదకరమని  ఈ తరహా ఉల్లంఘనల పై కఠిన చర్యలు తీసుకుంటామని  త్రిపురారం పోలీస్  స్టేషన్లో హాలియా సీఐ సతీష్ రెడ్డి, త్రిపురం  ఎస్ ఐ  నరేష్ తెలిపారు. త్రిపురారం మండల  పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బంది  ఆధ్వర్యంలో మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.  ఈ క్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ.. మైనర్లు వాహనాలు నడపొద్దునే త్రిబుల్ రైడింగ్ చేయొద్దని స్టేషన్ నందు మైనర్లకు మరియు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరిగింది.ఈ డ్రైవ్‌లో మైనర్లు నడిపిన 18 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నాము అని తెలియజేశారు. మైనర్ డ్రైవింగ్ చట్టవిరుద్ధం మరియు ప్రాణాలకు ప్రమాదకరం. ఈ తరహా ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోబడతాయి అని మైనర్లు వాహనాలు నడిపినట్లయితే ₹25,000 వరకు జరిమానా, వాహనం రిజిస్ట్రేషన్ రద్దు, తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది అన్నారు.అవసరమైతే జైలు శిక్ష కూడా విధించబడుతుంది. తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలి. మీ నిర్లక్ష్యం మీ పిల్లల ప్రాణాలకు మాత్రమే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం కలిగిస్తుంది. ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు నిరంతరం కొనసాగుతాయి. దయచేసి ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ఉండండి.  ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags: